25-04-2025 12:00:00 AM
కార్మికులకు ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ పిలుపు
సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్
బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 24: 139వ మే డే స్ఫూర్తితో కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు కోసం పోరాడుదామని ఐఎఫ్టీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ అన్నారు. గురువారం బెల్లంపల్లి సింగ రేణి సివిక్ విభాగం కార్యాలయ ఆవరణలో 139 మే డే పోస్టర్ ఆవిష్కరణ ఆవిష్కరించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను అమలు చేసి దేశంలో ఉన్న 50 కోట్ల మంది కార్మికుల సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత నరేంద్రమోదీ ప్రభుత్వం విస్మరించడం శోచనీయమని ఆయన అన్నా రు. కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ అధిపతులు అంబానీ, ఆదానీలకు ప్రజాసంపదను కట్టబెట్టెందుకే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను తెచ్చిందన్నారు.
తద్వారా కార్మిక వర్గానికి మరణశాసనం విధించారన్నారు. అన్నదాత రైతన్న అంటూ భారత వ్యవసా య రంగాన్ని బలిపీఠం ఎక్కిస్తున్న నరేంద్ర మోడీ రైతు వ్యతిరేక విధానాలను నిర సిం చాలన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను, అన్యాయాన్ని ప్రశ్నిస్తే, కార్మికుల్ని, నిర్బంధిస్తుందని విమర్శించారు. కేంద్ర సర్కార్ ఫాసిస్ట్ పాలనను కొనసాగిస్తూ, ఎమర్జెన్సీని మరిపిస్తోందని ఆయన మండిపడ్డారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేయడం ఆపి, రక్షించాలని, ఆయన డిమాండ్ చేశా రు.
సుప్రీంకోర్టు 2016 అక్టోబర్ 26 తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం వెంటనే అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలన్నారు. దేశంలోని కార్మికులందరికీ పీఎఫ్ ఈఎస్‌ఐ చట్టాలను అమలు చేయాలని కోరారు. స్వచ్ భారత్‌లో అగ్ర భాగాన ఉన్న గ్రామపంచాయతీ, మున్సిపల్ కార్మికులకు కేంద్ర ప్రభు త్వం ప్రత్యేక నిధి కేటాయించి, ఉద్యోగాలు పర్మినెంట్ చేయాలని, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలన్నారు.
బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని లేదా కేంద్ర ప్రభుత్వం జీవన భృతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. చికాగో అమరవీరుల అమరత్వం స్ఫూర్తితో గ్రామ గ్రామానా మేడే సభలు నిర్వహించి, కార్మిక ఉద్యమానికి సమరశంఖం పూరించాలని కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో ఎస్‌సీసీడబ్ల్యూయూ, ఐఎఫ్టియు -రీజియన్ నాయకులు కృష్ణవేణి, జి వెంకటి, బి లింగన్న, శ్రీనివాస్, భాను, కొమరన్న, పద్మ, కరుణ, సునీత, పోసక్క, చంద్రక ళ, అమృత, లక్ష్మి, కమల, వెంకటేష్, గణేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.