calender_icon.png 19 April, 2025 | 11:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతసామరస్యాన్ని పాటిస్తూ సోదర భావంతో మెలగాలి

08-04-2025 12:00:00 AM

జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.జె.కె.అహ్మద్  

పాల్వంచ, ఏప్రిల్7 (విజయ క్రాంతి):  మత సామరస్యానికి మన దేశం ప్రతీకగా నిలుస్తోందని, ఒకరి మతాన్ని మరొకరు గౌరవిస్తూ పండుగలను కలసికట్టుగా, సుహృద్భావంతో జరుపుకోవడం భారతీయ సంస్కృతిలో భాగమని నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.జె.కె. అహ్మద్  అన్నారు. సోమవారం ఎస్.జె.కె. అహ్మద్ ఆ ధ్వర్యంలో దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ మహా పట్టాభిషేకం సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులకు ఓ ఆర్‌ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్.జె.కె. అహ్మద్ మాట్లాడుతూశ్రీరాముని ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. నేటి యువత కుల, మతాలకు అతీతంగా మతసామరస్యాన్ని పాటిస్తూ, సోదరభావంతో కలిసి మెలిసి ఉండాలి. అన్ని పండుగలను కలసికట్టుగా జరుపుకుంటూ, మతసామరస్యాన్ని చాటుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకుందాం. ఈర్ష్యాద్వే షాలను వదిలిపెట్టి, ఐకమత్యంగా ముందు కు సాగుదాం అని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం సభ్యు లు సయ్యద్ అక్బర్, ఓం ప్రకాష్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.