ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
కల్వకుర్తి , జనవరి 24: కుల మతాలకు అతీతంగా జరపబడుతున్న దర్గా ఉత్సవాల్లో ప్రజలంతా సుఖ శాంతులతో మెలగాలని కోరుతూ ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం వెల్దండ మండలం భైరాపూర్ గ్రామంలో జరుగుతున్న సైదులు(దర్గా) గందోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే సైదులు(దర్గా) గందోత్సవంలొ పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. మున్ముందు ఇలాంటి ఉత్సవాలు ప్రజల సంతోషాల నడుమ జరుపుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. దర్గా వద్దకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఐక్యత ఫౌండేషన్ ద్వారా 2.50.లక్షల రూపాయలతో రేకుల షెడ్ నిర్మాణం చేసినందుకు గ్రామస్తులంతా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.