calender_icon.png 18 April, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెడు మార్గం వదిలి ఉద్యోగాలు సంపాదించాలి

09-04-2025 11:15:26 PM

ఎస్పీ నరసింహ..

కోదాడ: యువకులు చదువు మరిచి చెడు వ్యసనాలకు బానిసవుతున్నరని, చెడు మార్గం వదిలి ఉద్యోగాలు సంపాదించాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని కొమరబండ గ్రామంలో నిర్వహించిన పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నరసింహ పాల్గొని మాట్లాడారు. బహిరంగ మద్యం తాగుతూ సామాన్యులను, మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలకు చట్టాలు శిక్షలు వివరించడానికి పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం ద్వారా పోలీసులు మీ ముందుకు వచ్చారని అన్నారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉంటే భవిష్యత్తులో యువత మంచి మార్గంలో నడుస్తారని అన్నారు. పిల్లలను బాగా చదివించి ఉన్నత ఉద్యోగాలుగా ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, సిఐ రజిత రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణరావు, ఎస్ఐలు అనీల్ రెడ్డి, నవీన్, రాంబాబు, సిబ్బంది ఉన్నారు.