calender_icon.png 20 April, 2025 | 2:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి

19-04-2025 12:00:00 AM

ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ఏప్రిల్ 18 (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారిని ఆదుకోవా లని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. శుక్రవారం ముషీరాబాద్‌లోని రెయిన్‌బో  అనాథాశ్రమంలో బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు బాబాబాయి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ... అనాధ పిల్లలకు అండగా నిలిచి వారికి అన్ని విధాలా సహాయసహకారాలు అందించాలని కోరారు. ముషీరాబాద్ రెయిన్ బో  అనాథాశ్రమంలో బాలికలు క్ర మశిక్షణతో బాగా చదువుకుంటారని,  వారికి అన్ని విధాలా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసిం హా, ముషీరాబాద్ డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కొండా శ్రీధర్ రెడ్డి, పార్టీ నాయకులు శివ  ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.