24-03-2025 04:19:07 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): దేశంలో క్షయ నివారణకు ప్రతి ఒక్కరూ చేయూతనందించి, తమ వంతు సహకారం ఇవ్వాలని, ఖానాపూర్ టీబీ సూపర్వైజర్ వేణు, కౌన్సిలర్లు రామ్ చందర్ అన్నారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా, ఖానాపూర్ మండలంలోని, మస్కాపూర్ కేజీబీవీ పాఠశాల బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. క్షయ నివారణకు తమ వంతు బాధ్యతగా, ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. వ్యాధి నివారణకు, అధునాతన పరికరాలు అందుబాటులో ఉన్నాయని, క్షయ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, వారికి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సునీత, సిబ్బంది, తదితరులు ఉన్నారు.