calender_icon.png 22 April, 2025 | 5:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటిస్థలం లేనివారికి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలి

22-04-2025 02:03:10 AM

ఇబ్రహీంపట్నం సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ 

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 21 :ఇంటిస్థలం లేనివారికి స్థలం ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలనీ ఇబ్రహీంపట్నం సిపిఎం పార్టీ మున్సిపల్ కమిటీ తరఫున రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇబ్రహీంపట్నం మున్సిపల్ లో ఇంటి స్థలం లేని వారు 450 మంది కుటుంబాలు ఉన్నాయని, ఇబ్రహీంపట్నం మున్సిపల్ లో 30 సంవత్సరాలనుండి కిరాయి ఇండ్లలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్నారనీ తెలిపారు.

ఇబ్రహీంపట్నం ఖాల్సా సర్వేనెంబర్ 02లో ప్లాట్ నెంబర్ 05/2, 6/2, 34/1, 35/2, 169, 170 విస్తీర్ణం 15 ఎకరాలు ఇండ్ల స్థలాల గురించి భూదాన బోర్డుకు అర్జీపెట్టుకోగా 22.06.2013 రోజున సిపిఎం నాయకులు బోడ. సామేలు 19.06.2013న తదితరులు దరఖాస్తు చేయగా పైన తెలిపిన సర్వేనెంబర్లలో ఇండ్ల స్థలాల కొరకు 10 ఎకరాలు ఇండోర్ స్టేడియం కొరకు 5 ఎకరాలు భూదాన బోర్డువారు కేటాయించడం జరిగిందని తెలిపారు.

గత ప్రభుత్వం 2023-24సంవత్సరంలో రెవెన్యూఆదికారులు సర్వేయర్లు కలిసి డబుల్ బెడ్రూం ఇండ్లకోరకు లేఅవుట్ చేశారనీ, ఇట్టి స్థలంలో ఇండ్ల స్థలంలేని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి కి విన్నవించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి పి.యాదయ్య, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యదర్శి చింతపట్ల ఎల్లేష్, మున్సిపల్ కమిటీ సభ్యులు ఎర్పుల వీరేశం, చెనమోని శంకర్, బోడ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.