* రాష్ర్ట అభ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి
నారాయణపేట, జనవరి 3 (విజయ క్రాంతి): పదవుల వల్ల మనకు వన్నె రావడం కాదని, మన వల్ల పదవులకు వన్నె రావాలని రాష్ర్ట ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మక్తల్ మార్కెట్ కమిటీ పాలకవర్గానికి శుభాకాంక్షలు, అభి నందనలు తెలిపారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. పాల మూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఉన్నారని, మక్తల్ మార్కెట్ కమిటీకి అవసరమైనవన్నీ సమకూరుతా యని తెలిపారు. కొత్తగా నియమించబడిన పాలకవర్గం కరీంనగర్ జిల్లాలోని ముల్కనూ ర్ మార్కెట్ కమిటీ ని సందర్శించాలని చెప్పారు.
ముల్కనూర్ మార్కెట్ కమిటీ లో రైతులకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నా ఆర్థిక సహాయం చేస్తారని, రైతు ఇంట్లో ఏదైనా శుభకార్యానికి ఆర్థిక ఇబ్బంది వస్తే సాయం చేస్తారన్నారు. అలాంటి ఆదర్శవంతమైన, దేశంలోనే గొప్ప మార్కెట్ కమిటీ అయిన ముల్కనూర్ మార్కెట్ కమిటీని ఒకసారి చూసి రావాలని నూతన పాలకవర్గానికి మంత్రి సూచించారు.
మక్తల్ నియోజకవ ర్గంలో డబ్బులు పెట్టి పదవులు కొనే పరిస్థితి గతంలో ఉండేదని కానీ సమర్ధుడైన స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పారదర్శకం గా పరిపాలన చేసే నాయకుడు అని కితాబు నిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై విపక్షాలు ఇష్టానుసారంగా నిందారోపణలు చేస్తున్నా యని ఆయన ఎద్దేవా చేశారు.
నిజాలు మాట్లాడేందుకు కూడా ఎంతో ధైర్యం కావా లన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే పార్లమెంట్ లో ప్రత్యేక తెలంగాణ రాష్ర్ట బిల్లు పాసై యావత్ తెలం గాణ ప్రజల దశాబ్దాల కల నెరవేరిందని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు నివాళుల ర్పించలేదని ప్రశ్నించారు. రాష్ర్ట అప్పులపై అసెంబ్లీ సాక్షిగా బీఆర్‌ఎస్ నాయకులు అబద్దాలు ప్రచారం చేశారని మండిపడ్డారు.
ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంటే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిం చారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, తమ ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక హామీలను నెరవేరుస్తుంటే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు.
త పాలకులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తే తమ ప్రభుత్వం ఆర్థిక సంభంలో ఉన్నా కూడా ఎన్నికల హామిలైన 6 గ్యారంటీ లను అమలు చేస్తోందని చెప్పారు. మక్తల్ నియోజకవర్గానికి రూ.175 కోట్లతో 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు.
వంద శాతం రైతు భరోసా అందరికీ వస్తుందని, శనివారం జరిగే క్యాబి నెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. మన జీవనం విధానం, సం స్కృతి ద్వంసమైందని, వాటిని కాపాడుకో వాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడ్డారు. కొత్త సంవత్సరం కొత్త ఆలోచనల తో, కొత్త ఒరవడితో ముందుకు సాగాల న్నారు.
ప్రస్తుత సమాజంలో మానసిక, ఆరోగ్యపరమైన రుగ్మతలు ఉన్నాయని, మ న ఆలోచన ధోరణిని మార్చుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంద న్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ టం, ఆడంబరాలకు పోయి అప్పుల పాలవు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవన విధానంలో మార్పు రావాలని చెప్పారు.
స్వధర్మం ఆచరణ సాధ్యం.. పరధ ర్మం అతి భయంకరమైందని వ్యాఖ్యానిం చారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. బిఆర్‌ఎస్ హయాంలో మార్కెట్ కమిటీలే కాకుండా వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని విమర్శించారు.
వాటినన్నింటిని బలోపేతం చేసే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం తో ముందుకు సాగుతున్నారని తెలిపారు. రైతు భరోసా పై విపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మొద్దని రైతులకు సూచించా రు. కొండలు, గుట్టలు ,రాళ్లురప్ప లకు గత ప్రభుత్వం అప్పనంగా 20 వేల కోట్ల రూపాయలను రైతుబంధు పేరిట ఇచ్చారని ధ్వజమెత్తారు.
తమ ప్రభుత్వం అరులైన వ్యవసాయదారులకే రైతు భరోసా కల్పిస్తుం దని స్పష్టం చేశారు. సభకు అధ్యక్షత వహించిన స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. నేను మక్తల్ నియోజక వర్గానికి తాను చేసిన అభివృద్ధిని, తమ ప్రభుత్వ హయంలో నియోజకవర్గానికి మంజూరైన నిధులను, ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ది పొందిన లబ్ధిదారుల వివరాలను, నిధులను గణాంకాలలో వివ రించారు.
తనపై కావాలని ఆరోపణలు చేసే నాయకుల కుట్రలను తిప్పి కొట్టాలని కార్య కర్తలకు పిలుపునిచ్చారు. మక్తల్ లో ఏ ఒక్క కాంగ్రెస్ కార్యకర్తకు గౌరవం పోయినా... తన గౌరవం పోయినట్లేనని చెప్పారు. గేట్ల వద్ద కాపలా కాసే రోజు నుంచి నేరుగా తన బెడ్ రూమ్ వరకు కార్యకర్తలు ధైర్యంగా వచ్చే స్థాయి వరకు తీసుకువచ్చానని ఆయన ధీ మా వ్యక్తం చేశారు.
తాను ఎమ్మెల్యేగా గెలి చిన తర్వాత నియోజకవర్గానికి 300 కోట్ల బడ్జెట్ తీసుకువచ్చానని, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కోర్టుకు ఇచ్చానని, రూ.15 కోట్లతో సి.ఆర్ అర్ కింద రోడ్డు తీసుకువచ్చానని, 86 కోట్లతో మక్తల్ నారాయణపేట్ కు తారు రోడ్డు మంజూరు అయిందని, మరో 13 కోట్లతో సంగం బండ బండ పగలగొట్టి 25 వేల ఎకరాలకు నీరు అందించేందుకు కృషి చేశానని, ఐదున్నర కోట్ల కలెక్టర్ నిధులను తెచ్చి అభివృద్ధి పనులకు వినియోగించానని, అన్ని గ్రామా లకు డీలర్ షిప్లు ఇప్పించానని, డయాలసిస్ సెంటర్ కోసం ప్రతిపాదనలు పంపించా నని, మక్తల్ రెవిన్యూ డివిజన్ కోసం ప్రయ త్నం చేస్తున్నానని, కొన్ని కోట్ల నిధులతో మక్తల్ లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ను త్వరలో నిర్మాణం చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
జీవో 69 ద్వారా ఊట్కూరు మండలం కూడా శశ్యామలం కానుందని తెలిపారు. వచ్చే నాలుగు సంవత్సరాలలో నియోజకవర్గంలో తారు రోడ్డు లేని గ్రామ మంటూ ఉంటే వచ్చే ఎన్నికల్లో తాను ఓట్లు అడగబోనని స్పష్టం చేశారు. తన ఇంటి దేవుడు పడమటి ఆంజనేయుడి సాక్షిగా ఎవ్వరి వద్ద నయాపైసా కోసం చేయి చాచ లేదని ఖరా ఖండిగా తేల్చి చెప్పారు.
కాగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్ పర్సన్ రాధా లక్ష్మారెడ్డి ,వైస్ చైర్మన్ తో పాటు పాలకవర్గ సభ్యులకు మంత్రి, ఎమ్మె ల్యే ఘనంగా సన్మానించారు. ఈ కార్య క్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ వనజ, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి, డీసిసి ప్రశాంత్ కుమార్ రెడ్డి, డిసిసి మాజీ అధ్యక్షులు, పేట కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ కుంభం శివకుమార్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నాయకులు బాల కిష్టారెడ్డి, దేవర మల్లప్ప ఇతర నాయకులు పాల్గొన్నారు. అంతకుముందు మంత్రి జూపల్లి కృష్ణా రావు, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరితో కలిసి పడమటి ఆంజనేయస్వామిని దర్శిం చుకుని ప్రత్యేక పూజలు చేశారు.