calender_icon.png 25 February, 2025 | 4:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవాలాల్ మహరాజ్ అడుగుజాడల్లో నడవాలి

25-02-2025 01:18:58 AM

కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్, ఫిబ్రవరి 24 (విజయక్రాంతి): సేవలాల్ జీవితచరిత్ర ప్రతి ఒక్కరికి అచరణీయమని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం స్థానిక రాంలీలా మైదానంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్  286వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీఓ కుష్బూ గుప్తా తో కలిసి ముఖ్య అథితి గా హాజరైయ్యారు. ముందుగా బోగ్ బండార్  నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బంజారాలతో కలిసి నృత్యాలు చేయగా, ఐటీడీఏ పీవో బంజారాల సాంప్రదాయ దుస్తులలో మహిళలు, యువతులతో కలిసి నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ సమాజంలో ప్రతి మనిషి సమానమని ఎన్నో ఏళ్ల క్రితమే సంత్ సేవాలాల్ తెలిపారన్నారు.

సేవ గుణంతో అందరిని అక్కున చేర్చుకున్న మహానీయుడని కొనియాడారు. ఆయన జీవితచరిత్రను నేటి తరం వారు తెలుసుకుంటు కమ్యూనిటికి సంబంధం లేకుండా సేవ చేస్తే సమాజంలో ఉన్న కష్టాలు తొలుగుతాయన్నారు.  కార్యక్రమంలో బంజార సేవ సంఘం నేతలు పాల్గొన్నారు.