calender_icon.png 27 April, 2025 | 5:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలాంటి సినిమాలపైనే ఫోకస్ పెట్టాలి

25-04-2025 12:00:00 AM

డైరెక్టర్ త్రినాథరావు నక్కిన నిర్మాతగా మారి తొలిసారి నిర్మించిన చిత్రం ‘చౌర్యపాఠం’. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ క్రైమ్- కామెడీ డ్రామాతో ఇంద్రారామ్ హీరోగా, నిఖిల్ గొల్లమారికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా త్రినాథరావు విలేకరులతో పలు విషయాలు పంచుకున్నారు. “ఇటీవల నేను థియేటర్స్‌పై కామెంట్స్ -వైరల్ కావాలని చేసినవి కాదు.

వాస్తవానికి థియేటర్లకు రమ్మని ప్రేక్షకులను రిక్వెస్ట్ చేయడమే నా ఉద్దేశం. థియేటర్స్ కల్చర్‌ను కంటిన్యూ చేయమని కోరాను. అయితే, ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గించడానికి -చాలా కారణాలున్నాయి. సినిమాలు చాలా జాగ్రత్తగా తీయాల్సిన అవసరం ఉంది. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా సినిమాలు తీయడంపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. నాకు సంపాదన మీద దృష్టి లేదు.

కొత్తవారికి అవకాశం కల్పించే ఉద్దేశంతోనే నిర్మాణంలోకి వచ్చా. తన ఫాదర్ సర్వీస్‌లో జరిగిన ఓ చిలిపి దొంగతనం గురించి కార్తిక్ ఘట్టమనేని చెప్పినప్పుడు ఆసక్తిగా అనిపించింది. ఆ కేసును పూర్తి సినిమాటిక్‌గా మార్చాం. దొంగలకు కాదు కానీ, చోరీ చేయాలనుకునేవారికి ఈ సినిమాలో ఓ పాఠం ఉంటుంది (నవ్వుతూ)” అన్నారు.