14-04-2025 05:35:36 PM
సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి
సూర్యాపేట (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక విప్లవకారుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో మనువాదం పై పోరాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్ లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల నిర్మూలన, అంటరానితనం నిర్మూలించాలని పోరాటం చేసిన అంబేద్కర్ స్ఫూర్తితో ఆయన రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న బిజెపిని గద్దె దించేంతవరకు పోరాడాలని పిలుపునిచ్చారు.
పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ ను అవమానపరిచాడని ఉన్నారు. రాజ్యాంగం స్థానంలో మను రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టాలని చూస్తుందన్నారు. రాజ్యాంగంలో పేర్కొనబడిన సోషలిజం అని పదాలను తొలగించాలని చూస్తుందన్నారు. ఈ దేశంలో అన్నదమ్ముల ఉంటున్న హిందూ, ముస్లిం, క్రైస్తవుల మధ్య ఉన్న ఐక్యతకు భంగం కలిగిస్తూ వారి ఐక్యతకు భంగం కలిగించే హిందుత్వ బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొలి శెట్టి యాదగిరి,సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు, కోట గోపి, జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, జె.నరసింహారావు, ధనియాకుల శ్రీకాంత్, మేకన బోయిన శేఖర్, కొప్పుల రజిత, నాయకులు మామిడి సుందరయ్య, కామ్రేడ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.