calender_icon.png 19 March, 2025 | 8:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి

19-03-2025 02:45:21 AM

ఆర్డీవో లోకేశ్వరరావు 

కుమ్రం భీం ఆసిఫాబాద్,మార్చి 18(విజయ క్రాంతి): రాజకీయ పార్టీలు ఓటరు జాబితా రూపకల్పనకు సహకరించాలని ఆసిఫాబాద్ ఆర్డిఓ లోకేశ్వరరావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా సవరణల లో భాగంగా ఓటరు జాబితా రూపకల్పన పై  సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణ కార్యక్రమం 2025 లో భాగంగా పేర్ల నమోదు, పేరు సవరణ, మార్పులు, చేర్పులు, తొలగింపులకు ఫారం 6,7,8 లను సమర్పిం చాలన్నారు. ఓటరు జాబితా చిరునామా మార్పు కొరకు ఫారం 8 ని సమర్పించాలని తెలిపారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటరు జాబితా సవరణలపై గ్రామాలలో అవగాహన కల్పించాలని కోరారు.అర్హత గల ఓటర్లు అందరూ ఒకే ప్రాంతంలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.ఈ కార్యక్రమంలో తాహసిల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.