calender_icon.png 12 February, 2025 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్షయ వ్యాధి నిర్మూలనకు సహకరించాలి

12-02-2025 12:00:00 AM

డాక్టర్ సుధాకర్ 

మఠంపల్లి, ఫిబ్రవరి 11 : జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమములో భాగంగా మంగళవారం మఠంపల్లి మండ లం లోని పెద్దవీడు గ్రామం నందు ప్రాథ మిక ఆరోగ్య కేంద్రం వారిచే 100 రోజుల నిక్షయ్ శివిర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యమన్ని ఉద్ధేశించి మఠంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ మాట్లాడుతూ 2030 వరకు క్షయ వ్యాధిని నిర్మూలిం చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఇందుకు గాను ప్రతి అనుమానిత వ్యక్తికి ముందస్తుగా తెమడ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంతకు ముందు చికిత్స చెపించుకున్న వారి కుటుంబీకులు, షుగర్ వ్యాధి గ్రస్తులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, పొగతాగడం అలవాటు ఉన్న వారు, కా ర్పెంటర్ పని చేయుచున్నవారు తదితరులు విధిగా ముందస్తు పరీక్షలు నిర్వహించు కోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో 88  మందికి  తెమడ పరీక్షలు, ఎక్స్ రే పరీక్షలు మరియు  క్షయ వ్యాధి నిర్ధారణ ఇంజెక్షన్ పరీక్షలు  చేసారని తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి ప్రభాకర్, సూపర్వుజర్ రవి, నాగేంద్రమ్మ, హుజూర్ నగర్ టిబి యూనిట్ సూపర్వుజర్ మమత, జిల్లా టిబి యూనిట్ కో ఆర్డినేటర్ ప్రసాద్,డిఈఓ మాధవరెడ్డి, ఎంఎల్‌హెపి ఆదిలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ రమేష్, ఎఎన్‌ఎమ్ సీతమ్మ, ఆరోగ్య సహాయకులు శ్రీనివాస్, భాస్కర్, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బం ది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.