ఆదిలాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): ఆదిలాబాద్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సహకరించాలని ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ కోరారు. ఆదిలాబాద్‌లో అసంపూర్తిగా ఉన్న ప్రభుత కార్యాలయాల సముదాయాలను మంగళవారం వారు సందరించి, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జిల్లాలో గత ప్రభుతం ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల నిర్మాణానికి రూ.69 కోట్లు మంజూరు చేసిందని, ప్రస్తుతం ఆ భవనాలు అసంపూర్తిగా ఉన్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుతం వచ్చి ఏడాది గడుస్తున్న పట్టించుకోవడం లేదన్నారు. భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయకపోవడంతో రాష్ర్ట ప్రభుత తీరుపై ధజమెత్తారు. సరాష్ర్టంలో సైతం ఆదిలాబాద్ అభివృద్ధిపై నేతలు శీతకన్ను ధోరణి ప్రదరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుతం యుద్ధప్రాతిపదికన నిధులు మంజూరు చేసి, ఆదిలాబాద్ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధిలో కేంద్ర ప్రభుతం వాటాను తీసుకువచ్చేందుకు తమ తమ బాధ్యతగా కృషి చేస్తామని తెలిపారు.