calender_icon.png 1 April, 2025 | 6:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి రహిత జిల్లాకు సహకరించాలి

25-03-2025 01:11:01 AM

యాంటీ డ్రగ్స్ సోల్జర్స్ సేవలు వినియోగించుకోవాలి

సిద్దిపేట అర్బన్, మార్చి 24: తెలంగాణ యాంటి నార్కోటిక్ బ్యూరో లో యాంటీ నార్కోటిక్ సోల్జర్ గా  ఎంపికై, శిక్షణ పొందిన వడ్ల శ్రీనివాస్, జనార్దన్ మందలు సోమవారం  సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ వారిద్దరినీ అభినందించి మాట్లాడారు. స్కూల్, కాలేజీలలో ఇతర మాస్ ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని  కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో పోలీ సులతో కలిసి పని చేయాలని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల రహిత జిల్లాగా చేయడానికి ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం చాలా ముఖ్యమని తెలిపారు.

గంజాయి రహిత జిల్లాకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. గంజాయి ఇతర మత్తు పదార్థాలు కలిగివున్న, విక్రయించిన వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట పోలీస్ కంట్రోల్ రూమ్ 8712667100 కు  సమాచారం అందించాలని సూచించారు.