calender_icon.png 27 October, 2024 | 5:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రాభివృద్ధికి ఏకతాటిపైకి రావాలి

10-08-2024 12:58:09 AM

  • తెలంగాణ ఎంపీలకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్, ఆగస్టు 9 (విజయక్రాంతి): తెలంగాణ అభివృద్ధికి రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలు ఏకతాటిపైకి రావాలని, ఒకే అజెండాతో కలిసి ముందుకు సాగాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. ఢిల్లీలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహిచిన తెలంగాణ ఎంపీలతో ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ (రాజ్యసభ) ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పలు ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి సూచనలు చేయాలని ఎంపీలందరినీ కోరారు.

గత ఏడేళ్లలో రాష్ట్రానికి ఇచ్చిన కేంద్ర నిధులు, సహకారాన్ని ఆయన గుర్తుచేశారు. యువతకు ఉపాధి అవకా శాలను కల్పించడంతోపాటు పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అంత రాన్ని తగ్గించడంపై దృష్టి సారించాలని కాంగ్రెస్‌కు చెందిన పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ పేర్కొన్నారు. తెలంగాణలో విభిన్న పరిశ్రమల స్థాపన కు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఫార్మా స్యూటికల్ పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే క్లస్టర్ల ద్వారా ఫార్మా సిటీని డెవలప్ చేయడం చాలా కీలకమని బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యు లు బండి పార్థసారథిరెడ్డి వివరించారు.

రాష్ట్రంలోని అన్ని పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ఉండాలని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి పునరు ద్ఘా టించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలు కుందూరు రఘువీర్, బలరాంనాయక్, అనిల్‌కుమార్‌యా దవ్, బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీజేపీ ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, సీఐఐ తెలంగాణ చైర్మన్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సాయి ప్రమోద్, సీఐఐ తెలంగాణ పబ్లిక్ పాలసీ టాస్క్‌ఫోర్స్ చైర్మన్ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.