బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 20 (విజయక్రాంతి): కాంగ్రెస్ సర్కారు చేయా ల్సింది అపజయోత్సవాలని బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి ప్రేమేందర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలతోపాటు దేవుళ్లను సైతం మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. బుధవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బిడ్డలను పొట్టనబెట్టుకున్న సోనియాకు రేవంత్ గులాంగిరీ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కిషన్‌రెడ్డిపై ఇష్టానుసారం గా మాట్లాడటం మంచిదికాదని హెచ్చరించారు.