calender_icon.png 13 January, 2025 | 10:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమాజానికి మార్గదర్శకులవ్వాలి

13-01-2025 01:13:17 AM

వివేకానందుడి ఆశయాలను సాధించుకోవాలి: ఎమ్మెల్యే మేఘా రెడ్డి

వనపర్తి, జనవరి 12 ( విజయక్రాంతి ) : వివేకానందుడి ఆశయ సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని స్వామి వివేకనందుడు ఆశించిన ఆశయాలను యువత సాధించేందుకు పాటుపడాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘరెడ్డి  పేర్కొన్నారు. స్వామి వివేకానందుడి 162 వ జయంతి సందర్భంగా వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే  పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా  ఎమ్మెల్యే మాట్లాడుతూ వివేకానందుడి జయంతిని పురస్కరించుకొని  దేశవ్యాప్తంగా యువజన దినోత్సవాన్ని జరుపు కుంటామని యువత సన్మార్గంలో ఉంటే దేశం పూర్తిస్థాయిలో అభివద్ధి చెందుతుందని  సూచిం చిన వివేకానందుడి ఆశయ సాధన కోసం వనపర్తి నియోజకవర్గ పరిధిలోని యువకులందరూ పాటుపడాలని ఎమ్మెల్యే సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పాకనాటి కష్ణయ్య, కౌన్సిలర్లు చీర్ల సత్యం, విభూతి నారాయణ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.