calender_icon.png 10 January, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెట్టిచాకిరి నుంచి విముక్తి చేయాలి

31-12-2024 01:29:44 AM

చేతులకు సంకెళ్లు వేసుకొని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల వినూత్న నిరసన

కరీంనగర్, డిసెంబర్30(విజయక్రాంతి): గత 18 సంవత్సరాలుగా తెలంగాణ సమగ్ర శిక్షలో వెట్టి చాకిరి ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్న ఉద్యోగుల బానిస సంకెళ్లు తెంపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెగ్యులర్ చేయాలని తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం చేతులకు సంకెళ్లు వేసుకుని వినూత్న నిరసన వ్యక్తం చేశారు.

ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె 21 రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గత ఏడాది సెప్టెంబర్ 13న పిసిసి అధ్యక్షుని హోదాలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యో గులు హనుమకొండలో ఏకశిల పార్క్ వద్ద చేస్తున్న దీక్ష శిబిరాన్ని సందర్శించి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వందరోజుల్లో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు అయిన రెగ్యులరైజేషన్, ఉద్యోగులకు 10 లక్షల హెల్త్ కార్డులు, సమగ్ర శిక్ష మహిళా ఉద్యోగులకు 108 రోజులు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, 61 సంవత్సరాలు నిండిన ఉద్యోగులకు 20 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్.

మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షులు బెజ్జంకి ఆంజనేయులు,జిల్లా అధ్యక్షులు గుండా రాజిరెడ్డి,జిల్లాప్రధాన కార్యదర్శి మహేశ్,జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, రవిచంద్ర, శ్రీనివాస్,భరత్ కేజీబీవీ ప్రత్యేక అధికా రులు, పీజీసీఆర్టీలు, సిఆర్‌టిలు, డిపిఓ స్టాప్, ఐఇఆర్పిలు, సిఆర్పిలు, ఎమ్‌ఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, మెసెంజర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.