calender_icon.png 19 April, 2025 | 3:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నాం

10-04-2025 01:19:46 AM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన 

దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి

 మూసాపేట ఏప్రిల్ 9 : రైతుకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నామని రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. బుధవారం జానంపేట గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాలో పడతాయని గ్రేడ్ ఏ రకం సన్నలు ధాన్యం క్వింటాలకురూ 2,320  సాదారణ రకంకు, దొడ్డు ధాన్యం క్వింటాలకు రూ 2,300 మద్దతు ధర ఇస్తామని సన్న ధాన్యం క్వింటాలకు రూ 500 బోనస్ ఇస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఆర్ ఓ రాజు నాయక్, ఎంపీడీఓ కృష్ణయ్య, ఎంపీఓ అనురాధ, జనంపేట పంచాయతీ కార్యదర్శి మాధవి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి శేఖర్,  మూసాపేట మండల బి సి పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు నల్లా తిరుపతయ్య గౌడ్, దేవరకద్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ బగ్గీ కృష్ణయ్య, తదితరులు ఉన్నారు.