కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట, ఫిబ్రవరి 1(విజయ క్రాంతి): చెప్పాము.. చేశాము.. చూశాము.. అంటే సరిపోదని, పదో తరగతి పరీక్షా ఫలితాలలో నారాయణపేట జిల్లా ర్యాంకు ను గతేడాది కంటే మెరుగైన స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు.
పదో తరగతి విద్యార్థులకు ఇటీవలే నిర్వహించిన రివిజన్ టెస్ట్ -1 ఫలితాలపై జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం సాయంత్రం జిల్లా విద్యా శాఖ అధికారి గోవింద రాజుల అధ్య క్షతన జిల్లాలోని ఏంఈఓలు, 90 పాఠశా లల హెచ్‌ఎంలతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఉన్నత, జిల్లా పరిషత్, కస్తూర్బా, మాడల్ పాఠశాల రివిజన్ టెస్ట్ -1 ఫలితాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిలకించిన కలెక్టర్ తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు.
చాలా పాఠశాలలలో విద్యార్థులు గణితం, ఆంగ్లం, సామాన్య శాస్త్రాలలో తక్కువ మార్కులు వచ్చాయని, ఇంతకీ ఆయా సబ్జెక్టుల ఉపా ధ్యాయులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన సీ గ్రేడ్ విద్యార్థులపై ప్రత్యేక దష్టి సారించి వారిని ఆ సబ్జెక్టులలో మంచి మార్కులు సాధించే విధంగా ప్రత్యేక తరగతులను తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైన పాఠశాలల హెచ్.ఎం లను కలెక్టర్ వివరణ అడిగారు. గత నెలలో జరిగిన సమీక్షలో గొప్పలు చెప్పారని, ఇప్పుడు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. విద్యార్థులు సరిగ్గా చదవడం లేదని, గైర్హాజర్ అవుతున్నారని, సబ్జెక్టులు వారికి అర్థం కావడం లేదని ఏడాది చివర్లో, వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో చెబితే ఎలాగని తక్కువ ఉత్తీర్ణత శాతం నమోదైన పాఠశాలల హెచ్‌ఎం లపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
సబ్జెక్టుల ఉపాధ్యాయులు, విద్యార్థులపై కారణాలు చెప్పకుండా పాఠశాల పూర్తి బాధ్యత హెచ్‌ఎం లదే అని, పాఠశాలల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రణాళిక ప్రకారం ముం దుకు వెళ్లాలని సూచించారు. ఏదో మారు మూల ప్రాంతంలోని పాఠశాలల ఉత్తీర్ణత శాతం తగ్గిందంటే పర్వాలేదు కానీ జిల్లా కేంద్రానికి సమీపంలోని జాజాపూర్ పాఠశా ల ఉత్తీర్ణత శాతం కూడా తగ్గిందంటే ఇంతకీ ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. పరీక్షకు గైర్హాజర్ అయిన విద్యార్థులకు మరుసటి రోజు పరీక్ష రాయించాలన్నారు.
విద్యార్థు లకు అర్థమయ్యే విధంగా రివిజన్ చేయించా లన్నారు. ఉత్తీర్ణత తక్కువ వచ్చిన పాఠశాలల పై ప్రత్యేక శ్రద్ధ వహించి, రివిజన్-2 పరీక్షలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డీఈవో ను ఆమె ఆదేశించారు.
పదవ తరగతి పరీక్షలపై సీరియస్ నెస్ లేదని, ఇలాగే ఉంటే గతేడా ది కంటే జిల్లా ర్యాంక్ చివరి స్థానానికి పడిపోతుందని, ఇప్పటికైనా ఉపాధ్యాయు లు, హెచ్‌ఎంలు, ఎంఈఓ లు తమ తమ పరిధిలో శాయశక్తులా విద్యార్థులకు స్పెషల్ క్లాసులు తీసుకొని, అర్థం కాని సబ్జెక్టుల చాప్టర్ల పై వీలైనంత ఎక్కువగా రివిజన్ చేయించి పరీక్షలను బాగా రాసేలా విద్యా ర్థులను సిద్ధం చేయాలని కోరారు.
జిల్లాలో రివిజన్ టెస్ట్-1 లో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల హెచ్‌ఎం లతో కలెక్టర్ మాట్లాడారు. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ?.. ఇతర పాఠశాలల హెచ్‌ఎం లకు సూచిం చాలని ఆమె తెలిపారు.
ఇకపై రివిజ న్ టెస్ట్-2లో ఉత్తీర్ణత శాతం తగ్గితే ఆయా పాఠ శాలల హెచ్‌ఎం లకు నోటీసులు ఇవ్వాలని, అలాగే ఈ సమీక్ష సమావేశానికి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా గైర్హాజర్ అయిన హెచ్‌ఎం లకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
ఈ సమీక్షలో ట్రైనీ కలెక్టర్ గరీమానరుల, సీఎంఓ రాజేందర్, ఏఎంఓ విద్యాసాగర్, సెక్టోరల్ అధికారి శ్రీనివాసులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం వివిధ ప్రాథమిక పాఠశాలలకు వచ్చిన ఎఫ్.ఎల్.ఎన్. స్టడీ మెటీరియల్ ను జిల్లా కలెక్టర్ హెచ్‌ఎం లకు అందజేశారు.