15-04-2025 01:31:18 AM
- పారదర్శకంగా అభివృద్ధి చేస్తున్నాం
- దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి
అడ్డాకుల ఏప్రిల్ 14 : ఏదో మాయ మాటలు చెప్పి కాలం వెళ్లదీసే విధానం తమది కాదని చెప్పడం కంటే మంచి పనులు చేసి చూపించడమే మన ప్రజా ప్రభుత్వం ధ్యేయమని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. సోమవారం మండలం శాఖాపూర్ గ్రామంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి విస్తృతంగా పర్యటించి ప్రాథమిక పాఠశాల అదనపు గదుల నిర్మాణ పనులకు, సి,ఆర్, ఆర్ నిధులతో ఎస్సీ కాలనీలో వివిధ అభివృద్ధి పనులకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పునరుద్ధ పనులు, ఉన్నత పాఠశాల కాంపౌండ్ వాల్ పనులకు, వాల్మీకి,ఎస్సీ కాలనీ కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన, సీసీ రోడ్లను, హైమాస్ట్ లైట్స్ ను ప్రారంభించి తదనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ...
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ 15 నెలల కాలంలోనే ఎన్నడూ లేని విధంగా శాఖాపూర్ గ్రామంలో రూ 78 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామాభివృద్ధిని పడకేసిందని, శాఖపూర్ గ్రామంలో బిఆర్‌ఎస్ గత పదేళ్ల పాలనలో ఒక డబల్ బెడ్ రూమ్ ఇల్లు గాని, ఒక రేషన్ కార్డు గాని ఇవ్వలేదని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ, ఒక్కొక్క హామీని నెరవేరుస్తుందని, త్వరలో శాఖాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపడతామని తెలియజేశారు. కాటవరం తండా లో సీతారాముల దేవాలయం లో శివలింగం, ఆంజనేయస్వామి, నవగ్రహల ప్రతిష్టాపన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు చేశారు. అంతకుముందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు ఉన్నారు.