calender_icon.png 22 January, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆందోళన చెందొద్దు... అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తాం

22-01-2025 07:55:12 PM

అర్హులను లబ్ధిదారుల జాబితాలో చేర్చండి

గ్రామ సభలో ఆధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే కూనంనేని...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకొని అర్హుల జాబితాలో పేర్లు నమోదుకాని లబ్ధిదారులు ఆందోళన చెందొద్దని అర్హులైన ప్రతి పేద కుంటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు, తెల్ల రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తామని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Koonamneni Sambasivarao) అన్నారు. నియోజకవర్గ పరిధిలో రెండోరోజు బుధవారం నిర్వహించిన వార్డు, గ్రామసభల్లో అయన పాల్గొని లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియని పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కూనంనేని అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజాపాల గ్రామసభల్లో ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులపై సర్వే నిర్వహించిన అధికారులు అర్హుల జాబితాను ప్రకటించారని, పూర్తిస్థాయిలో జాబితాలో అర్హులను చేర్చకపోవడంతో ఆందోళనకు గురి అవుతున్నారన్నారు.

గ్రామసభల్లో కొత్తగా స్వీకరించిన దరఖాస్తులకు తక్షణమే సర్వే చేపట్టి పూర్తి స్థాయిలో జాబితాను సిద్ధం చేసి ప్రకటించాలని అధికారులకు సూచించారు. ప్రకటించిన అర్హుల జాబితాలో జగిరిన పొరపాట్లను సరిచేయాలని సూచించారు. ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరిగినా ఉపేక్షించేదిలేదని, వివాదాలు లేని జాబితాను సిద్ధంచేసి ప్రజల ముందుంచే భాద్యత అధికార యంత్రంగంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, తహసీల్దార్ పుల్లయ్య, మున్సిపల్ కమిషనర్ శేషాంజన్ స్వామి, రెవెన్యూ, మున్సిపల్ శాఖ అధికారులు, కౌన్సిలర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.