calender_icon.png 22 January, 2025 | 5:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తాం

21-01-2025 05:38:54 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీలో జిల్లాలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dotre) పునరుద్ఘాటించారు. ప్రజల దగ్గర నుండి సంక్షేమ పథకాలపై అభిప్రాయ సేకరణ సర్వేకు సంబంధించి ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో డిఆర్డిఓ దత్తారావుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రైతు భరోసా కింద సాగు భూములకు మాత్రమే భరోసా మొత్తాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. రాళ్లగుట్టలు, వెంచర్లు, ప్లాట్లు లాంటి భూములను గుర్తించడం జరిగిందన్నారు. భూమిలేని నిరుపేదలు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 20 రోజులపైగా పని చేసిన కుటుంబాలను గుర్తించడం జరిగిందని వీరికి సంవత్సరానికి 12,000 చెల్లించడం జరుగుతుందని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రతి ఇంటికి అధికారులు సర్వే చేయడం జరిగిందని వివరించారు. దీని ప్రకారం అర్హులైన వారిని గుర్తించడం జరిగిందన్నారు. అర్హులైన వారి జాబితాను గ్రామసభలో గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారి చదివి వినిపించడం జరుగుతుందని ఏదైనా అభ్యంతరాలు ఉంటే ప్రజలు తెలియజేయాలన్నారు. వాటిని సభలో నమోదు చేసి క్షేత్రస్థాయిలో మరోసారి అటువంటి వాటిపై సర్వే నిర్వహించడం జరుగుతుందని వివరించారు. లబ్ధిదారుల జాబితాలో తమ పేరు లేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జాబితాలో లేని వారు ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ రోహిత్ కుమార్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.