- సంగారెడ్డిలో త్వరలో 500 పడకల దవాఖాన ఏర్పాటు చేస్తాం
- రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
సంగారెడ్డి, ఆగస్టు 8 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డిలో త్వరలో 500 పడకల దవాఖానను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గురు వారం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన, రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అదేవిధంగా మెడిక ల్ కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించి విద్యార్థుల సమస్యలు తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల మందులు, పరికరాలు అందుబాటులో ఉన్నాయని, వైద్యులు, సిబ్బంది రోగు లకు మెరుగైన సేవలందించాలని సూచించారు. డయాలసిస్ బెడ్లు పెంచాలని ఆదే శించారు. మెడికల్ హాస్టల్ భవనం అసంపూర్తి పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రులు మెడికల్ చట్టాలు అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి, శిక్షణ కలెక్టర్ మనోజ్, ఆర్డీవో వసంతకుమారి, మున్సిపల్ చైర్‌పర్సన్ విజయలక్ష్మి, డీఎంఈ డాక్టర్ వాణి, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్, జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధా, డీఎంహెచ్‌వో డాక్టర్ గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు.