calender_icon.png 7 February, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం..

06-02-2025 11:18:27 PM

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్..

ముషీరాబాద్ (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్స్ అసోసియేషన్ (ట్రస్మా) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ అన్నారు. ఈ మేరకు గురువారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ట్రస్మా ముషీరాబాద్ మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ముషీరాబాద్ మండల ఉప విద్యాధికారి శ్రావణ్ కుమార్, విశ్రాంత డిప్యూటీ ఈఓ చిరింజీవిలను షాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అదే విధంగా అసోసియేషన్ ముషీరాబాద్ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడుగా సయ్యద్ అహ్మద్ భక్తీయార్, ప్రధాన కార్యదర్శి అంకం శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు నీలం సంజీవ్, కోశాధికారిగా టి. మురళీధర్ రావులు నియమితులయ్యారు.

అనంతరం ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ మాట్లాడుతూ... తమ అసోసియేషన్ 5 వేల పాఠశాలల సభ్యత్వం ఉన్నదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం తమ అసోసియేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని అన్నారు. సంఘం ఆధ్వర్యంలో సుమారు 30 వేల ఉపాధ్యాయులు ట్రైనింగ్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని తెలిపారు. బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు సుమారు 35 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ముషీరాబాద్ మండల డిప్యూటీ ఐఓఎస్ స్వరూప రాణి, డిప్యూటీ ఐఓఎస్ జయలక్ష్మీ, తెలంగాణ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. రమేష్, కోశాధికారి రాఘవేంద్ర, నగర అధ్యక్షుడు ఉమా మహేశ్వర్ రావు, ప్రధాన కార్యదర్శి శ్రీ సయ్యద్, కోశాధికారి రఘు, మంచాల తదితరులు పాల్గొన్నారు.