calender_icon.png 25 January, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందజేస్తాం

24-01-2025 10:51:19 PM

భూపాల్ పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...

మహదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలు మండలాల్లో ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే గంటల సత్యనారాయణరావు మాట్లాడుతూ... అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందజేస్తామని అన్నారు. శుక్రవారం ప్రజాపాలన  సందర్భంగా ఘనపురం మండలం చెల్పూర్, మొగుళ్లపల్లి మండలం పర్లపల్లి గ్రామాలలో నిర్వహించిన గ్రామసభలలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ... భూపాలపల్లి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలో భాగంగా జనవరి 26వ తేదీ నుండి ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ పథకం, రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి గత నాలుగు రోజులుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జాభితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అర్హులైన ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని అన్నారు.

ప్రజాపాలన, కులగణన సర్వేలో భాగంగా సేకరించిన దరకాస్తులతో పాటు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను సిబ్బంది ఇంటింటికి వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించి ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఎంపిక చేయబడిన లబ్ధిదారుల వివరాలను గ్రామసభలలో ప్రజల సమక్షంలో చదివి ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ... ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందిస్తామని తెలిపారు. ఇప్పటికే అధికారులు దరఖాస్తు చేసుకున్న కుటుంబాలను సర్వే నిర్వహించడం జరిగిందని, గ్రామసభలలో చదివి వినిపించిన జాబితాలో పేర్లు నమోదు కానీ కుటుంబాల వ్యక్తులు తిరిగి గ్రామ సభలలో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్ద దరకాస్తులు చేసుకోవాలని తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇదిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు నిరంతర ప్రక్రియ అని అర్హత ఉన్నప్పటికీ పథకంలో పేరు లేని వారు నిరాశ నిస్పృహలకు లోను కావద్దని ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు అర్హులైన వారందరికీ అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాల్లో గణపురం, మొగుల్లపల్లి మండల ప్రత్యేక అధికారులు కుమారస్వామి, సునీత, తహసిల్దార్లు సత్యనారాయణ స్వామి,  సునిత, ఎంపీడీవోలు భాస్కర్, మహబూబ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.