calender_icon.png 21 April, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నాం

11-04-2025 12:51:01 AM

సిద్దిపేట, ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో గత ప్రభుత్వం నిర్వీర్యం అయిందని సిద్దిపేట జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యులు డాక్టర్ సూర్య వర్మ సూచించారు. గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 10 సంవత్సరాల పాటు ప్రజలకు ట్రాన్స్పోర్ట్ విభాగంలో మెరుగైన సేవలందలేవని, ఇకనుంచి అలాంటి దుస్థితి రాకుండా తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.

వాహనదారులు, లైసెన్స్ దారులు, రైతులకు ఇబ్బంది కలిగితే తనను సంప్రదించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పరిపాలన సాగిస్తుందని అందుకు ఇప్పటివరకు లబ్ధిదారులకు అందుతున్న పథకాలే ఉదాహరణగా వివరించారు. సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడంలో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.

పార్టీ పట్ల కృతజ్ఞతతో ఉండి, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన నాయకులకు పదవులు దక్కుతాయని సూచించారు. రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ సభ్యులుగా నియామకమైన డాక్టర్ సూర్య వర్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.