- ఇటీవల మెస్ చార్జీలు పెంచాం
- త్వరలో గురుకులాల పర్యవేక్షణకు కమిటీ
- రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
సిద్దిపేట, నవంబర్ 28(విజయక్రాంతి): గురుకులాల్లో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించడంలో రాజీపడే ప్రసక్తి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అధికారులను ఆదేశించారు. అలాగే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు. ఇటీవల మెస్ చార్జీలు పెంచామని భోజనంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గురువారం సిద్దిపేటలోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాలను అధికారులతో కలసి ఆయన తనీఖీ చేశారు. పాఠశాల అవరణలో తిరిగి పరిశుభ్రతను పరిశీలించారు. వంట గదిలో అన్నం, కూర, చారును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో గురుకుల పాఠశాలల పర్యవేక్షణకు కమిటీని నియమిస్తామ న్నారు.
ఆ కమిటీ కన్వీనర్‌గా జిల్లా ఆదనపు కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, డీఆర్డీవో పీడీ, జిల్లా పంచాయతీ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ కమీటి సభ్యులు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి గురుకుల పాఠశాలలను సందర్శించి పర్యవేక్షిస్తారని తెలిపారు.
అనంతరం మహాత్మ జ్యోతిబా పూలే వర్థంతి సందర్బంగా పాఠశాలలో ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మంత్రి వెంటా జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఆర్డీవో సదానందం, తహసీల్దార్ సలీం, స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీలత తదితరులు ఉన్నారు.
విద్యార్థి దశనుంచే పరిశోధనలు చేయాలి..
సిద్దిపేట, నవంబర్ 28 (విజయక్రాంతి): విద్యార్థి దశ నుంచే పరిశోధనలు చేయడం ప్రారంభిస్తే సమాజానికి మంచి పరిశోధకులు లభిస్తారని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. గురువారం సిద్దిపేటలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశా లలో ఏర్పాటు చేసిన జిల్లా బాలల వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఆరోగ్యం, వ్యవసాయం, కాలుష్యం నివారణపై పరిశోధనలు జరగాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తు విద్యార్థులకు మెనూ చార్జీలు పెంచినట్లు చెప్పారు. ప్రభుత్వ బడుల్లో పరిసరాలు, వంటశాలలు పరిశుభ్రంగా ఉండాలని అన్నారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ మను చౌదరి, జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో సదానందం, తహసీల్దార్ సలీం, వివిధ మం డలాల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
బీఎల్‌కేఆర్ భవన్‌గా హుస్నాబాద్ బల్దియా బిల్డింగ్
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో కొత్తగా నిర్మించిన బల్దియా బిల్డింగ్‌కు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతారావు(బీఎల్‌కేఆర్) పేరు పెట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో అధునాతన హంగులతో నిర్మించిన బల్దియా కొత్త బిల్డింగ్‌ను గురువారం ఆయన ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీగా ఉన్న హుస్నాబాద్ అంచెలంచెలుగా మున్సిపాలిటీగా ఎదిగిందన్నారు. హుస్నాబాద్ అభివృద్ధికి బాటలువేసిన మాజీ ఎమ్మెల్యే బొప్పరాజు లక్ష్మీకాంతారావు ఇక్కడి ప్రజల స్మృతిపథంలో ఉన్నారన్నారు. అందుకే సహకారసంఘం భవనంలో ఆయన విగ్రహాన్ని పెట్టుకున్నామన్నారు.
ఇప్పుడు నూతనంగా నిర్మించుకున్న మున్సిపల్ బిల్డింగ్‌కు కూడా బొప్పరాజు లక్ష్మీకాంతారావు పేరును పెట్టుకుందామన్నారు. ఇది తన ఆలోచన అని.. దీనిపై మున్సిపల్ పాలకవర్గం తీర్మానం చేసి ఆమోదించాలని కోరారు. దీంతోపాటు లక్ష్మీకాంతారావు ఇంటిని లైబ్రరీగా తీర్చుదిద్దుతామన్నారు.
హుస్నాబాద్ డెవలప్‌మెంట్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక దృష్టి సారించి నిధులు తీసుకురావాలని మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీవో రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్‌పర్సన్ అనిత, కౌన్సిలర్లు పాల్గొన్నారు
పూలేను ఆదర్శంగా తీసుకోవాలి
కరీంనగర్, నవంబర్ 28(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం జ్యోతిరావుపూలే వర్థంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం సుందరగిరిలో పూలే విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు.
జ్యోతిరావుపూలేను యువత ఆదర్శంగా తీసుకొని ముం దుకు కదలాలన్నారు. ఈ కార్యక్రమంలో కరీంన గర్, సిద్ధిపేట జిల్లా కలెక్టర్లు పమేలా సత్పతి, మను చౌదరి, సిద్ధిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమి టీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సైదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.