calender_icon.png 20 April, 2025 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేవాదుల 90 శాతం కట్టింది మేమే

04-04-2025 01:15:56 AM

  1. టీడీపీ పునాది రాయి వేస్తే కాంగ్రెస్ గాలికొదిలేసింది
    1. దేవన్నపేట వద్ద మూడు పంపులకు రూ.1250 కోట్లు ఇచ్చినం
    2. 27న వరంగల్‌లో కనీవిని ఎరుగని రీతిలో రజతోత్సవ సభ
    3. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి

జనగామ, ఏప్రిల్ 3(విజయక్రాంతి): దేవాదుల ప్రాజెక్టును టీడీపీ నామమాత్రంగా ప్రారంభిస్తే.. కాంగ్రెస్ గాలికొది లేసిం దని, ఈ ప్రాజెక్టు 90 శాతం పనులు బీఆర్‌ఎస్ హయాంలోనే జరిగాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. దేవాదుల ద్వారా ఐదు లక్షల 14 వేల ఎకరాలకు నీళ్లు పారించిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన స్పష్టం చేశారు. జనగామ జిల్లా బీఆర్‌ఎస్  కార్యాలయంలో స్టేషన్‌ఘన్‌పూర్ ముఖ్య కార్యకర్తలతో రజతోత్సవ సభ సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గోదావరి నదీ తీరాన ఆయన వెంట ఓ మేస్త్రిని తీసుకెళ్లి నామమాత్రాంగా దేవాదుల ప్రాజెక్టు కోసం పునాది రాయి వేసి వెళ్లిపోయారన్నారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పదేళ్ల కాలంలో కేవలం 40 వేల ఎకరాలకే నీరు ఇచ్చిందన్నారు. వారు దేవాదులను గాలికొదిలేస్తే.. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. 5 లక్షల 14 వేల ఎకరాలకు దేవాదుల ద్వారా నీళ్లు ఇచ్చారన్నారు.

ఫేస్ 1, ఫేస్ 2 పూర్తి చేసి ఫేస్3లో భాగంగా రామప్ప దగ్గర నుంచి దేవన్నపేట వరకు టన్నెల్, దేవన్నపేట నుం చి ధర్మసాగర్ వరకు పంపులకు సంబంధించిన కార్యక్రమాన్ని మొదలుపెట్టి రూ.1250 కోట్ల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. ఇటీవల కాంగ్రెస్ మంత్రులు మోటార్లు ఆన్ చేసి తామే దేవాదుల పూర్తి చేసినట్లు కలరింగ్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 

కడియం ఎనిమిది పైసలు తేలే..

స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.800 కోట్లు తెచ్చానని చెప్పు కుంటున్న కడియం శ్రీహరి.. 8 పైసలు కూడా తేలేదని పల్లా అన్నారు. ఆయన ఒక్క పని కూడా ప్రారంభించకుండా గ్లోబల్ ప్ర చారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఏడు రిజర్వాయర్ లలో ఒక్కటన్నా కడియం కట్టించారా అని ప్రశ్నించారు.

స్టేషన్‌ఘన్‌పూర్ తనతో పాటు తాటికొండ రాజయ్య చేసిన అభివృద్ధి తప్ప కడియం చేసిందేమీ లేదన్నారు. కార్యకర్తలను మోసం చేసి పార్టీ మారిన కడియంకు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న వరంగల్‌లో జరుగనున్న జరిగే సభకు స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి 30 వేలకు తగ్గకుండా హాజరుకావాలని కోరారు.  స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సెవెల్లి సంపత్ పాల్గొన్నారు.