calender_icon.png 24 January, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూజీసీ మార్గదర్శకాలను వ్యతిరేకిస్తున్నాం

24-01-2025 01:53:42 AM

  • వర్సిటీలకు నిధులివ్వకుండా పెత్తనమేంది?

వర్సిటీల సమస్యలపై త్వరలో సీఎంతో సమావేశం

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): యూజీసీ మార్గదర్శకాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి తీవ్రంగా వ్యతిరేకించింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా యూజీసీ వ్యవహరిస్తోందని తెలం గాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. గురువారం మాసాబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో తన ను కలిసినమీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని వర్సిటీలకు నిధులను ఇవ్వకుండా పెత్తనమేందని ప్రశ్నించారు.

ఇష్టాను సారంగా మార్గదర్శకాలు, నిబంధనలను రూపొందించి వర్సిటీలపై రుద్ధడం సరికాదని తెలిపారు. ఒక విధానం పూర్తిస్థాయిలో అమలు కాకముందే దానిస్థానంలో వెనువెంటనే మరో నూతన సంస్కరణ తీసుకో రావడంతో రెండింటిలో ఏదీ అమలుకాకుం డా పోతుందని చెప్పారు. యూజీసీ ముసాయిదాను అధ్యయనం చేస్తున్నామని తెలి పారు. ఆ ముసాయిదా అమల్లోకి వస్తే వీసీల నియామకాల్లో రాష్ట్రాలకు ఎలాంటి అధికారం ఉండదని, కేంద్రం ఎవరినైనా నియమించొచ్చని వెల్లడించారు.

వీసీల పదవీకాలాన్ని ఐదేండ్లకు పెంచడమనేది స్వాగతించదగ్గ విషయమేనని, ఐదేళ్ల కాలం లో వర్సిటీలను అభివృద్ధి చేయొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రొఫెసర్ల నియా మకాల్లోనూ యూజీసీ మార్పులు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. గ్రాడ్యు యేషన్, పీజీల్లో ఏ సబ్జెక్టు చదివినా, నెట్‌లో అర్హత సాధించే సబ్జెక్టుతో ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించే అవకాశం సరికాద న్నారు.

యూజీసీ ముసాయిదాపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు. డిగ్రీలో పరీక్షల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు. వర్సిటీల సమస్యలు, ప్రొఫెసర్ల నియామకాలు, నిధుల కేటాయింపు సమస్య లన్నిం టీపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డితో అన్ని వర్సిటీల వీసీలతో కలిసి సమావేశమవుతామన్నారు. వర్సిటీల అభివృ ద్ధిపై నివేదికను సమర్పిస్తామన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశాలపై లోకల్, నాన్‌లోకల్ అంశంపై కూడా నివేదిక ఇస్తా మన్నారు.