06-04-2025 12:00:00 AM
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 5(విజయక్రాంతి): మియాపూర్ డివిజన్ లోగల విడియా కాలనీ, ఎఫ్‌సిఐ టీఎన్ నగర్ లో జీఎచ్‌ఎంసి చేపడుతున్న ఎస్‌ఎన్డీపీ డ్రైనేజీ పనులు తమ కాలనీగుండ వెళ్లడం పట్ల తమంత తీవ్రంగా ఇబ్బం ది పడుతున్నామని కాలనీ వాసూలు ఆందోళన వ్యక్తం చేసారు. గురునాథం చెరువు నుండి పటేల్ కుం ట వరకు లింక్ నాలా ఉందని, మెయి న్ రోడ్ నుండి వయా వీడియా కాలనీ నుండి పటేల్ కుంట వరకు కలపడానికి పెట్టి ప్రతిపాదనను వ్యతిరేకిస్తు న్నామన్నా రు.
ఈ డ్రైనేజీ సిస్టం వల్ల కాలనీ ప్రసు తం ఉన్న మంచి నీటి పైప్‌లు, డ్రైనేజీ సిస్టంకు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందన్నారు. నూతన డ్రైనేజీ వల్ల కాలనీ లో నివసిస్తున్న ప్రజలకీ తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని, దుర్వాసన వస్తుందన్నారు. వెంటనే దీనిపై అధికారులు చర్యలు తీసుకొని ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసి డ్రైనేజీ పనులు చేయాలని డిమాండ్ చేశారు.