calender_icon.png 24 February, 2025 | 6:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

24-02-2025 12:00:00 AM

సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు

భద్రాద్రి కొత్తగూడెం ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): జిల్లాలో ఈదురుగాలులు అకాల వర్షం కారణంగా పంట నష్ట పోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సంద ర్భంగా ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

రెండు రోజుల పాటు ఈదురు గాలులు అకాల వర్షం కారణంగా కళ్ళాలలో పోసిన మిర్చి పంటకు నష్టం జరిగిందని, అలాగే మొక్కజొన్న, మిర్చి తోటలు గాలికి వంగి పోయాయని తెలిపారు. ఇప్పటికే రైతాంగం పంటలకు పెట్టుబడి పెట్టి అమ్మడానికి సిద్ధంగా ఉన్న కల్లాల్లో పంట తడిసి పోవడం వల్ల సరైన ధర పలకదేమో తాలు పేరుతో తక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

మొక్కజొన్న, మామిడి రైతులు కూడా వేసిన పంట ఒంగి పోవడంతో మళ్ళీ పంట వేయాల్సిన పరిస్థితి అక్కడక్కడ ఉందని అన్నారు.అందుకని ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి పంట నష్టం అంచనా వేయాలని, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.మళ్ళీ తిరిగి పంట వేయాల్సి వస్తె ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేశారు.