26-04-2025 12:00:00 AM
రామకృష్ణాపూర్ ఏప్రిల్ 25 : క్యాతన్ పల్లి మున్సిపాలిటి పరిధి లో ఉన్న రామకృష్ణాపూర్ పట్టణానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ శుక్రవారం పట్టణ కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల డిపో అడిషనల్ క్లర్క్, మేనేజర్లకు వినతి పత్రం అందజేశారు. బస్సు సౌకర్యం లేక ఉద్యోగులు, వ్యాపారస్తులు, విద్యార్థులతో పాటు ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అధికారులకు వివరించారు.
క్యాతనపల్లి రైల్వే గేటుపై నిర్మించిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై వాహనాల రాకపోకలు జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. మంచిర్యాల నుంచి క్యాతనపల్లి, బి జోన్ వయా రామాలయం, ఆర్కే వన్ మీదుగా బస్సులను రోజుకు రెండు సార్లు నడపాలని కోరారు.
స్పందించిన అధికారులు వారం రోజుల్లో ప్రజలకు బస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, పిన్నింటి రఘునాథ్ రెడ్డి, గొపు రాజం తదితరులు వున్నారు.