17-05-2024 01:02:06 AM
ఆదిలాబాద్, మే 16 (విజయక్రాంతి): విత్తన కంపెనీలు, ఎరువుల డీలర్లు వానకా లం సాగుకు సన్నద్ధం కావాలని.. సీజన్‌లో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం విత్తన, ఎరువుల డీలర్లతో నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ మాట్లాడారు. డీలర్లు షాపులకు సంబంధించి తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని తెలిపారు. స్టాక్ వివ రాలను రోజువారీగా వెల్లడించాలని, బిల్ బుక్, రిజిస్టర్ నిర్వహించాలని సూచించారు. అధిక ధరలకు విక్రయించినా, గడువు ముగిసిన విత్తనాలు, ఎరువులు అమ్మినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారు లు రైతులకు అవగాహన కల్పించాలని.. ఎక్క డ కూడా విత్తనాలు, ఎరువుల కొరత ఉండకూడదని, జిల్లాకు సరిపడా అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో ట్రై నీ కలెక్టర్ అభిజ్ఞన్, వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య, ఏడీలు, ఏఓలు, డీలర్లు పాల్గొన్నారు.