calender_icon.png 23 November, 2024 | 6:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు రిజర్వేషన్లు పెంచి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి

23-11-2024 01:33:48 AM

  1. త్వరలో డెడికేటెడ్ కమిషన్‌కు తెలంగాణ జాగృతి నివేదిక
  2. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత 

హైదరాబాద్, నవంబర్ 22 (విజయక్రాం తి): కులగణనను పకడ్బందీగా చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పా టు చేసిన డెడికేటెడ్ కమిషన్‌కు నివేదిక అం దించాలని తెలంగాణ జాగృతి నిర్ణయించినట్లు తెలిపారు.

త్వరలో కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వర్లుకు నివేదిక అందించనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం తన నివాసంలో తెలంగాణ జాగృతి ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా  మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సమాజంలో అంతరాలను రూపుమాపడానికి, బలహీన వర్గాలను మరింతపైకి తీసు కరావడానికి ప్రభుత్వాలు కృషి చేయాలని డి మాండ్ చేశారు. బీసీలకు రాజకీయ రంగంలో రిజర్వేషన్లు పెంచాల్సిందేని తేల్చి చెప్పారు.  కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వేను నామమాత్రంగా కాకుండా పకడ్బందీగా చేయాలన్నారు.