- ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి
- ఉమ్మడి కరీంనగర్ జిల్లానేతలతో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులతో పాటు క్యాడర్ కూడా సమాయత్తం కావాలని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు.
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికపై మంగళవారం మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, రాజుఠాకూర్, మేడిపల్లి సత్యం, సంజయ్, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన పార్టీ నేతలతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను, లీడర్లను అప్రమత్తం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్‌రెడ్డి విజయానికి రూట్ మ్యాప్ రూపొందించుకో వాలని సూచించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పరంగా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొని వస్తే సత్వరమే పరిష్కరిస్తామన్నారు.