calender_icon.png 15 March, 2025 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిలో భాగస్వాములు కావాలి

17-12-2024 12:36:21 AM

* కలెక్టర్ నారాయణరెడ్డి

రంగారెడ్డి, డిసెంబర్16(విజయక్రాంతి): ప్రభుత్వ విభాగంలోని అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచిం చారు. ఇటీవల నూతనంగా ఎన్నికైన రంగారెడ్డి జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల అసోసియేషన్ సభ్యులు సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రామారావు, కార్యదర్శి శ్రీనేశ్‌కుమార్ నోరి, అసోసియేట్ అధ్యక్షుడు పీసీ వెంకటేశ్, ట్రెజరర్ శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు గంప శ్రీనివాస్, సభ్యులు.. అలివేలు , మంగ, అనిత, సూజాత, సైదమ్మ కలెక్టర్‌ను కలిసినవారిలో ఉన్నారు.