calender_icon.png 29 December, 2024 | 7:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా టీచర్లే కావాలి.. డిప్యుటేషన్లు వద్దు

29-12-2024 02:06:30 AM

కోరుట్ల , డిసెంబర్ 28 (విజయక్రాంతి) : కోరుట్ల మండలం క ల్లూరు గ్రామ శివారు లోని కేజీబీవీ గురు కుల బాలికల పాఠశా ల, కళాశాలలో పని చేస్తున్న సర్వ  శిక్షా అభియాన్  ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో పిల్లలకు బోధించడం ఇబ్బందైతుందని రాష్ర్ట విద్యాశాఖ ఆదేశాల మేరకు శనివారం కోరుట్ల ఎంఈఓ నరేశం 8 మంది మహిళా టీచర్లను తీసుకొని  పాఠశాల వద్దకు వెళ్లారు.

కాగా స్కూల్ లో పిల్లలు మా టీచర్లు మాకు కావాలి అని గేటు లోపలికి తాళం వేసుకొని బైఠాయించారు. టీచర్ల ను కొంత సేపు లోపలికి రాకుండా అడ్డుకొని విద్యార్థులు ఆందోళన చేశారు. చదువు నష్టపోతారని సమ్మె పరిష్కారం అయ్యే వరకు డిప్యుటేషన్ సిబ్బంది బోధిస్తారని ఎంఈవో నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు.   విషయం తెలుసుకున్న తహశీల్దార్ కిషన్, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

చదువు నష్టపోవద్దని కోపంతో చెప్పా ః ఎంఈవో నరేశం

సిబ్బంది సమ్మె నేపథ్యంలో  విద్యార్థులు నష్టపోవద్దని డిప్యుటేషన్ ఉపాధ్యాయులను నియమించాం. అనవసరంగా మొండిగా వ్యవహరించడంతో చదువు నష్టపోవడం సరికాదని ఒకింత కోపంగా చెప్పాల్సి వచ్చింది. స్టూడెంట్స్కు న్యాయం చేయాలని నచ్చ జెప్పి క్లాస్లు కొనసాగేలా చర్యలు తీసుకుంటాం.