calender_icon.png 18 October, 2024 | 6:02 AM

మాకు న్యాయం చేయాలి

18-10-2024 12:46:10 AM

  1. రోడ్డు ప్రమాద మృతుల బంధువుల డిమాండ్
  2. మృతదేహాల తరలింపులో ఉద్రిక్తత

వెల్దుర్తి (తూప్రాన్), అక్టోబర్ 17: శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ శివారులో బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలను తూప్రాన్ ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించగా గురు వారం పోస్టుమార్టం నిర్వహించారు. అయితే, మార్చురీ వద్ద మృతుల బంధువులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

తమకు న్యాయం జరిగే వరకు మృతదేహాలను తరలించేది లేదని పట్టుబట్టారు. రోడ్డు బాగాలేదని తెలిసినా వేగంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన వ్యక్తి రావాలని డిమాండ్ చేశారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకొని తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి, నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆవుల రాజిరెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పారు. ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతిం చారు. అనంతరం మృతదేహాలను  బంధువులకు అప్పగించారు.