వరంగల్‌తో పాటు భద్రాద్రి, అదిలాబాద్, పెద్దపల్లిలో ఎయిర్‌పోర్టులు చేపట్టాలి
- కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం రేవంత్
- బాపూఘాట్ అభివృద్ధ్దికి 220 ఎకరాల రక్షణ భూములు ఇవ్వాలి
- కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తి
- వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ గ్యారెంటీ అన్న పౌర విమానయానశాఖ మంత్రి
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి) : తెలంగాణలో వరంగల్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, అదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టు నిర్మా ణాలు చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరా రు.
మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రు లు రామ్మోహన్‌నాయుడు, రాజ్‌నాథ్‌సింగ్‌కి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీలతో కలిసి రాష్ట్రంలోని సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాలను కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడి దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి.. ప్రజలకు రవాణా వసతుల మెరుగుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో విమానాశ్రయ ఏర్పాటుకు ఒక విమానాశ్రయం నుంచి మరో విమానాశ్రయానికి 150 కి.మీ.దూరం ఉండాలనే నిబంధనపై అవసరమైన నిరభ్యంతర పత్రాన్ని (ఎన్‌వోసీ) రాష్ర్ట ప్రభుత్వం జీఎంఆర్ నుంచి పొందినదని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు.
253 ఎకరాల భూ సేకరణకు అవసరమైన రూ. 205 కోట్లను భారత విమానయాన సంస్థ (ఏఏఐ)కి అందజేసిందని వివరించారు. విమానాశ్రయ పనులకు అవసరమైన అనుమతులు, అక్కడినుంచి విమానాలు నడిపేందుకు అవసరమైన చర్య లు తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడిని రేవంత్ రెడ్డి కోరారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విమానాశ్ర య ఏర్పాటుకు గతంలో గుర్తించిన స్థలం అనువుగా లేనందున ప్రత్యామ్నాయంగా పాల్వంచలో 950 ఎకరాలు గుర్తించామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ భూమి వివరాలు ఏఏఐ అందజేశామని, వెంటనే విమా నాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కోరారు.
పెద్దపల్లి జిల్లాలో గతంలో గుర్తించిన భూమి విమానాశ్రయ నిర్మాణానికి అనువుగా లేదని ఏఏఐ ప్రీ-ఫీజుబిలిటీ సర్వేలో తేలిందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు తెలిపారు. దానికి ప్రత్యామ్నాయంగా రాష్ర్ట ప్రభుత్వం అంతర్గాంలో 591.24 ఎకరాలు గుర్తించిందని.. అక్కడి విమానాశ్రయ ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
ఆదిలాబాద్‌లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) ఆద్వర్యంలో ఇప్పటికే 369.50 ఎకరాల భూమి ఉందని, పూర్తిస్థాయి కార్యకలాపాలకు అదనంగా 249.82 ఎకరాలు అవసరమని సీఎం పేర్కోన్నారు. అదనంగా అవసరమైన భూమి సేకరించి అప్పగించేందుకు రాష్ర్ట ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్‌కు వెంటనే విమానా శ్రయం మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు.
విమానాశ్రయాల అభివృద్ధ్దికి సహకరిస్తాం
తెలంగాణలో విమానాశ్రయాలను అభివృద్ధ్ది చేయాలనే సంకల్పంతో ఉన్నామని కేంద్ర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయడు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో భేటీ తర్వాత మీడియా తో ఆయన మాట్లాడారు. వరంగల్‌లో కచ్చితంగా ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తామని, కొ త్తగూడెం దగ్గర అనువైన స్థలం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారన్నారు.
త్వరలో పెద్దపల్లి, కొత్తగూడెంకు సాంకేతిక బృందాన్ని పంపుతామన్నారు. పెద్దపల్లిలో విమానాశ్ర యం ఏర్పాటుకు కొన్ని సమస్యలు ఉన్నాయన్న కేంద్రమంత్రి.. వరంగల్‌లో ఎయిర్ పోర్టుకు భూ సేకరణ ఎంత తొందరగా పూర్తయితే అంత త్వరగా నిర్మాణ పనులు చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.
ఖర్గే, ప్రియాంకగాంధీతో భేటీ..
ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు మంగళవారం ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులను కూడా వివరించారు. ప్రియాంక గాంధీ వయనాడ్ లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో ఘనవిజయం సాధించడంతో ఆమెకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
బాపూ ఘాట్‌లో గాంధీ విగ్రహం ఏర్పాటుకు..
హైదరాబాద్‌లో ఈసీ, మూసీ నదుల సంగమ స్థలంలోని బాపూఘాట్ అభివృద్ధికి రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎక రాల భూమిని రాష్ర్ట ప్రభుత్వానికి బదిలీ చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశా రు.
మహా త్మా గాంధీ చితాభస్మాన్ని కలిపినచోట ఏర్పాటుచేసిన బాపూ ఘాట్‌ను ప్రపంచస్థాయిలో గాంధీ తాత్వికతను చాటే కేంద్రంగా తీర్చిదిద్దాలని తమ ప్రభు త్వం నిర్ణయించిందని కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు.
బాపూఘాట్ వద్ద గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలె డ్జ్ హబ్, ధ్యాన గ్రామం (మెడిటేషన్ విలే జ్), చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్ స్కేప్ ఘాట్లు, శాంతి విగ్ర హం (స్టాట్యూ ఆఫ్ పీస్), మ్యూజియంలతో గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టనున్నామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు.
ఇందుకోసం రక్షణ శాఖ భూమిని బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో సైనిక్ స్కూల్‌తో పాటు ఇతర అంశాలపై కూడా చర్చించారు. కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కె.రఘువీర్ రెడ్డి, ఎం.అనిల్ కుమార్ యాదవ్, ఆర్.రఘురామిరెడ్డి, డాక్టర్ కడి యం కావ్య అధికారులు ఉన్నారు.