వీరంతా రాజస్థాన్‌లోని గిరిజన తెగ ప్రజలు. తమకు ప్రత్యేకంగా భిల్ ప్రదేశ్ రాష్ట్రం కావాలని డిమాండ్‌చేస్తూ ఇలా శాంతియుతంగా నిరసన ప్రదర్శన మొదలుపెట్టారు. రాజస్థాన్‌లోని 12 జిల్లాలతోపాటు మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో తమ జనాభా అధికంగా ఉన్న మొత్తం 49 జిల్లాలతో భిల్‌ప్రదేశ్ ఏర్పాటుచేయాలని వారి డిమాండ్. ఆదివాసీ పరివార్ నాయకత్వంలో దాదాపు 35 గిరిజన సంఘాలు ఈ ఆందోళనల్లో పాల్గొంటున్నాయి.