22-04-2025 12:00:00 AM
పోలీసు గ్రీవెన్స్ డే లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 21 ( విజయ క్రాంతి ): ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. పోలీస్ డే లో భాగంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవర్ పాల్గొని 30 మంది ఆర్జీదారులతో నేరుగా మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకొవాలని, సూచించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి వేగంగా స్పందించి చట్ట పరంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఫిర్యాదుదారునికి భరోసా,నమ్మకం కలిగించాలని అన్నారు.
ఎవరైనా చట్టవ్యతిరకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కటినంగా వ్యవహరించాలని అన్నారు.