జడ్జి కుంచాల సునీత
నిజామాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): బాలల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని నిజామాబాద్ జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నారు. బాల్యంలో వారి శారీరక, మానసిక పరపక్వత సమయంలో పిల్లలకు సంరక్షణ చట్టపరమైన రక్షణ చాలా అవసరమని చెప్పారు. మహి ళా శిశు సంక్షేమశాఖ, బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో న్యాయసేవాధికారత సంస్థ ఆధ్వర్యంలో నిర్వ హించిన సమావేశంలో ఆమె మట్లాడారు.
పిల్లల రవాణ నిర్మూలనకు, బాల కార్మికులుగా పిల్లల బాల్యాన్ని దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత సమాజంలో అందరిపైనా ఉ న్నదన్నారు. మహిళా కమిషన్ సభ్యురాలు సుదం లక్ష్మీ మాట్లాడుతూ.. అమ్మాయిలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, వేధింపులకు గురైతే ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచించారు.
కార్యక్రమంలో జిల్లా సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ అధికారి షేక్ రసూల్‌బి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, డీసీపీ బసవరెడ్డి, డీపీవో చైతన్యకుమార్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు రాజేందర్, స్నేహ తదితరులు పాల్గొన్నారు.