- ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి
- పార్టీ కోసం కష్టపడిన వారికే పదవులు
- పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
- అభివృద్ధిని ఇంటింటికీ తీసుకెళ్లాలి
- డిప్యూటీ సీఎం భట్టి
- గాంధీభవన్‌లో పీసీసీ విస్తృతస్థాయి సమావేశం
హైదరాబాద్, నవంబర్ 21 ( విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించుకోవాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అనేక మందికి కార్పొరేషన్ల పదవులు, డీసీసీ అధ్యక్షులకు, పార్టీ అనుబంధ సంఘాలకు చైర్మన్ పదవులు దక్కాయని తెలిపారు. ప్రభుత్వంలో ఇంకా చాలా పదవులు ఉన్నాయని, పార్టీ కోసం పని చేసినవారందరికి పదవులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
గురువారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వర్‌రావు, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సల హాదారులు, పార్టీ నాయకులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో ప్రజా పాలన సంబురాలు కులగణన, స్థానిక ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడాది కాలంలో అద్భుతమైన పాలన అందించిందని, దేశంలో ఏ రాష్ట్రం చేయలేనంత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు చేసి చూపించారన్నారు. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్, బీజేపీలు చేస్తున్న తప్పుడు ప్రచారా లను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త తిప్పి కొట్టాలని, అందుకు తగ్గట్లుగా మన ప్రచారం ఉండాలని పిలుపునిచ్చారు.
వర్గీకరణ వ్యతిరేకులను సస్పెండ్ చేయాలి: సంపత్‌కుమార్
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ పా ర్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీలోని కొం దరు మాల సామాజిక వర్గానికి చెందిన నా యకులు మాట్లాడుతున్నారని, వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఏఐసీసీ కార్యద ర్శి సంపత్‌కుమార్ డిమాండ్ చేశారు.
కాం గ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు చేవెళ్ల డిక్లరేషన్‌లో పార్టీ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ కూడా వర్గీకరణకు అ నుకూలమని చాలాసార్లు చెప్పారని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయా నికి వ్యతిరేకంగా వ్యవహారించే వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అభివృద్ధి ఇంటింటికి తీసుకెళ్లాలి: డిప్యూటీ సీఎం
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని పార్టీ శ్రేణు లు ఇంటింటికి తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోని అమలు చేయ ని విధంగా ప్రజా ప్రభుత్వం అనేక సంక్షే మ పథకాలు అమలు చేస్తుంటే.. బీఆర్‌ఎస్, బీజేపీ చేస్తున్న దుష్ఫచారాన్ని పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. ప్రజా ప్రభు త్వం ప్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని వెల్లడించారు.
మూసీ పునరుజ్జీవానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నా యని మండిపడ్డారు. మూసీ పరివాహక ప్రాంతంలో బతుకున్న వారిని ఎవరిని బ యటికి వెళ్లగొట్టమని, అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తామన్నారు. ఇళ్లు కోల్పో యిన వారికి మూసీ అభివృద్ధి చెందిన తర్వాత అక్కడే మళ్లీ ఇళ్లు కట్టిచ్చి ఇస్తామని చెప్పారు.
ఓఆర్‌ఆర్, రీజినల్ రింగ్ రోడ్డును కలుపుతూ ఇండస్ట్రియల్ క్లస్టర్లు, రెసిడెన్షియల్ నివాసాలను నిర్మించబోతున్నట్లు చెప్పారు. కులగణన పూర్తి కావ చ్చిందని, ఇది దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
కాం గ్రెస్ హయాంలో పేదలకిచ్చిన భూములను గత బీఆర్‌ఎస్ సర్కార్ లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిందని, ఇప్పుడు కంపెనీల కోసం భూమి సేకరిస్తుంటే లగచర్లలో రైతులకు అన్యా యం జరిగిందని మాట్లాడటం విడ్డూరంగా ఉం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ పాలకులు గుంజుకున్న భూములను స్వాధీనం చేసుకుని పేదలకు అప్పగిస్తామని తెలిపారు.