- అమిత్‌షా వ్యాఖ్యలు నిరంకుశ పాలనకు నిదర్శనం
- ఎమ్మెల్సీ కోదండరామ్
హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): అంబేద్కర్‌పై అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు నిరంకుశ పాలనకు నిదర్శనమని.. రాజ్యాంగ రక్షణకు ప్రజాస్వామికవాదులు ఏకతాటిపైకి రావాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరామ్ పిలుపు నిచ్చారు. టీజేఎస్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ‘అంబేద్కర్ ఐడియాలజీ ఏళ్ల గణతంత్ర భారతదేశం’ అంశంపై గురువారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. మోడీ, అమిత్‌షాల నిరంకుశ పాలనకు రాజ్యాంగం అడ్డుకట్టగా మారిందని, అందుకే దానిపై దాడికి వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమం లో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్, టీజేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ బద్రుద్దీన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నర్సయ్య పాల్గొన్నారు.