calender_icon.png 23 April, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కరిజంపై జరిగే దాడిని ఐక్యంగా ఎదుర్కోవాలి

23-04-2025 12:25:49 AM

జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు -పిల్లి సుధాకర్

చర్ల, ఏప్రిల్ 22, (విజయ క్రాంతి ) : అం బేద్కరిజం పై జరిగే దాడిని ఐక్యంగా ఎదుర్కొంటూ, భారత రాజ్యాంగ రక్షణే  లక్ష్యంగా అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోవాలని జా తీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్  అన్నారు. చర్ల మండలం లిం గాపురం గ్రామంలోని  కొంగూరు సత్యనారాయణ స్వగృహంలో  మంగళవారం ము ఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ వాదాన్ని విచ్చిన్నం చేయడానికి మను వాద శక్తులు ప్రయత్నిస్తున్నాయని, దీనిని జాతీయ మాల మహానాడు కార్యకర్తలు తి ప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో ప్రాథమిక హక్కులకు తూట్లు పొడిచి అస్థిరతకు బాటలు వేస్తున్నారని,రాజ్యాంగం లోనే మన హక్కుల పేజీని ఒక్కొక్కటిగా చింపేస్తున్నారని ఆరోపించారు.

యువత అంబేద్కర్ వాదాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మిగులు తుందని ఆవేదన వ్యక్తం చేశారు..ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు జాతీ య కార్యదర్శి,జిల్లా ఇన్ ఛార్జ్ అసొద భా స్కర్, జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణమూర్తి, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఏ డెల్లి గణపతి, పల్లంటి రమేష్, బోళ్ల వినో ద్,జిల్లా మహిళా సంఘం అధ్యక్షురాలు బో డ దివ్య, తదితరులు పాల్గొన్నారు.