04-04-2025 12:00:00 AM
మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బైంసా ఏప్రిల్ 3 (విజయక్రాంతి): నిర్మ ల్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీలో మాజీమంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్య క్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి బాపూజీ చిత్రపటానికి, అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనం తరం రాజ్యాంగాన్ని రక్షించుకుందామని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
కరపత్రాలను పంపిణీ చేసి రాజ్యాంగ పీఠిక ప్రదర్శన చేప ట్టారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా అభివర్ణిస్తూ.. రాజ్యాంగాన్ని కాపాడాలని రాజ్యాంగ విలువలను కాపాడాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్క ర్ స్ఫూర్తిని, మహాత్మాగాంధీ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ దేశంలో భవిష్యత్ తరాలకు ముప్పు వాటిల్లుతోంది అని అది నిర్మూలించడానికి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జైబాబు జైభీమ్ జైసంవిధాన్ అభియా న్ యాత్రను గురువారం నిర్మల్ నియోజకవర్గంలో జరుపుకోవడం జరిగిందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గా లకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ యాత్ర ముందుకు సాగుతుందన్నారు. వీరితో పటు నాయకులు పాలుగోన్నారు. యాత్రలో ఇంద్రకరణ్ రెడ్డితోపాటు రాజారాం సత్యం తాజా మాజీ మునిసిపల్ చైర్మన్ ఖానాపూ ర్, నాదేడపు చిన్ను నిర్మల్ టౌన్ అధ్యక్షుడు, జూనైడ్ మేమూన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ అధ్యక్షుడు, ముడుసు సత్యనారాయణ ఎస్సీ సెల్, ధర్మాజీ రాజేందర్ ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్, రామలింగం, వాజిత్ ఖాన్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, రమణ రెడ్డి పీఎసీఎస్ చైర్మన్, రఘు మాజీ కౌన్సిలర్, పాకాల రాంచేందర్, గజేందర్ మాజీ కౌన్సిలర్, నాగశాలి రాజేందర్ మాజీ కౌన్సిలర్లు, రామకృష్ణ, అన్వార్ తదితరులు పాల్గొన్నారు.