24-03-2025 12:49:35 AM
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్
చేవెళ్ల, మార్చి 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నేతలు సత్తా చాటాలని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్ సూచించారు. ఇటీవల నూతన అధ్యక్షుడిగా నియ మితులైన ఆయనను ఆదివారం చేవెళ్ల మండలానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు గౌండ్ల కృష్ణ గౌడ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు బొబ్బిలి కుమార్ గౌడ్, పెద్దోళ్ల కృష్ణ, నాగరాజుగౌడ్ సన్మానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమైనన్ని స్థానాలు గెలుచుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ మేరకు మండల నాయకత్వం నుంచి బూత్ స్థాయి వరకు కష్టపడి పనిచేయాలని, తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం ఉపాధ్యక్షుడు కృష్ణమోహన్, నేతలు రిషికేశ్ గౌడ్, జశ్వంత్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.