03-03-2025 12:00:00 AM
దేశ సామాజిక నిర్మాణంలోనే అసమానతలు
పెట్టబడిదారీ విధానంతో సామాజిక సంబంధాల ధ్వంసం
గజ్వేల్‌లో టీపీటీఎఫ్ నిర్వహించిన విద్యాసదస్సులో ప్రొఫెసర్ కాశీం
గజ్వేల్, మార్చి 2 : దేశంలో నేడు ప్రభుత్వాలు ఫాసిజం మాటున పనిచేస్తున్నా యని, ప్రభుత్వాల నియంతృత్వ ధోరణలను మేధావులు ఎదిరించాల్సిన అవసరముందని ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు. ఆదివారం గజ్వేల్‌లో టిపిటిఎఫ్ నిర్వహించిన విద్యా సద స్సులో ప్రొఫెసర్ కాశీం పాల్గొని సంక్షే మ కాలంలో మేధావుల పాత్ర అన్న అంశంపై ప్రసంగించారు. సంభ కాలంలో ఎన్ని అణచివేతలు ఎదురైనా సమాజ శ్రేయస్సు కు పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. భారతదేశం అన్ని మతాలు, కులాలతో సమైక్యతతో కలగలిసిన ప్రజల నివాసమని దేశ ఉపాధ్యాయులు, మేధావులు ప్రజల అభ్యున్నతికి కృషి చేయాల్సిన అవసరం ఉన్న దన్నారు.
ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మేధావులు ప్రజలను చైతన్య పరుస్తూ ప్రభుత్వాలను అవసరమైనప్పుడు ప్రశ్నిస్తూ ఉండాలని పేర్కొన్నారు. టిపిటిఎఫ్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యను ప్రైవేటుపరం చేసే ఆలోచనలను , ప్రయత్నాలను మానుకొని ప్రభుత్వ పాఠశాలను మ రింత బలపడేటట్లు కృషి చేయాలని కోరా రు. కార్యక్రమంలో టిపిటిఎఫ్ రాష్ర్ట; అధ్యక్షులు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి తిరుపతి, జోన్ కన్వీనర్ శ్రీనివాస్, రాష్ర్ట అసోసియేట్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి;, ఉపాధ్యాయ దర్శిని సంపాదకులు ప్రకాష్ రావు, ఏపీటీఎఫ్ పూర్వాధ్యక్షులు ఏ.నరసింహారెడ్డి, పూర్వ రాష్ర్ట అధ్యక్షులు రామచంద్రం, అశోక్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదవీవిరమణ పొందిన ఉపాధ్యాయుడు రాజులును ఘనంగా సన్మానించారు.